: పేదల పెళ్లి కోసం లాటరీ
కేరళ ప్రభుత్వం పేదల పెళ్లిళ్ల కోసం ఒక లాటరీ స్కీమును తీసుకొచ్చింది. లాటరీ ద్వారా వచ్చే ఆదాయం నుంచి పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేయనుంది. దీనికి మాంగల్య లాటరీస్ అని పేరు పెట్టారు. వార్షికాదాయం లక్ష రూపాయల్లోపు ఉన్న కుటుంబాల్లోని యువతుల వివాహం కోసం 30వేల రూపాయలు ఆర్థిక సాయంగా అందిస్తారు.