: జమ్మూ కాశ్మీర్ లో కురుస్తోన్న మంచు.. జనజీవనం అస్తవ్యస్తం
జమ్మూ కాశ్మీర్ లోయలో భారీ హిమపాతంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జమ్మూ రహదారులపై రాత్రి నుంచి కురుస్తోన్న మంచు పేరుకుపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో అధికారులు ప్రధాన రోడ్లపై మంచును తొలగించి.. వాహన రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. దీనికితోడు, దట్టమైన పొగమంచుతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు స్టేషన్లలో పడిగాపులు పడుతున్నారు.