: గుజరాత్ లో 26 స్థానాలూ బీజేపీ ఖాతాలోనే: విజయ్ రూపాని


గుజరాత్ లోని 26 లోక్ సభ స్థానాలను బీజేపేయే గెలుచుకుంటుందని ఆ పార్టీ గుజరాత్ విభాగం ప్రధాన కార్యదర్శి విజయ్ రూపాని తెలిపారు. 2009 ఎన్నికల్లో బీజేపీ 16 స్థానాలనే గెలుచుకుంది. అప్పుడు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రతిపాదించకపోవడమే కారణంగా విజయ్ పేర్కొన్నారు. ఇప్పుడు గుజరాత్ ప్రజలు మోడీని ప్రధానిగా చూడాలని ఎంతో ఉత్సుకతతో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ను ఓడించి 26 స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News