: అమీర్ పేటలో బీభత్సం సృష్టించిన కారు


అదుపు తప్పిన కారు బీభత్సాన్ని సృష్టించింది. హైదరాబాద్ అమీర్ పేటలోని లాల్ బంగ్లా సమీపంలో వస్తున్న కారు... ఒక మ్యాన్ హోల్ ను తప్పించబోయి అదుపు తప్పింది. దీంతో, రోడ్డు మీద వెళ్తున్న జూకంటి శ్రీహర్ష అనే వ్యక్తిని ఢీకొట్టింది. అనంతరం, రెడ్డి ల్యాబ్స్ కు చెందిన మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీహర్షను చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News