: హాయిగా నిద్రపోండి... సమస్యలను దూరం చేసుకోండి


హాయిగా కంటినిండా నిద్రపోండి... మీ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోండి అంటున్నారు శాస్త్రవేత్తలు. నిర్ణీత వేళకు కంటినిండా నిద్రపోకుంటే పలురకాల అనారోగ్య సమస్యలు మనల్ని వేధిస్తాయి. ఈ విషయం తెలిసినా కూడా చాలామంది వేళకు నిద్రపోరు. మరికొందరు నిద్రలేమి సమస్యతో సతమతమవుతుంటారు. ఇలా సరిగా నిద్రపోని వారికి మెదడులో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎంత ఎక్కువగా అంటే ఒక బరువైన వస్తువుతో తలపై మోదితే ఎంతటి చెడు ప్రభావం ఉంటుందో... అంతటి చెడు ప్రభావం మనపై నిద్రలేమి వల్ల కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆరోగ్యంగా ఉండే యువతలో కూడా నిద్రలేమి వల్ల కలిగే దుష్ప్రభావం విపరీతంగా కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. రాత్రిపూట సరిగ్గా నిద్రపోని వారి రక్త నమూనాల్లో ఉదయం వేళల్లో ఎన్‌ఎస్‌ఈ...ఎస్‌`100బి అణువుల పరిమాణం అధికంగా కనిపించిందని, ఇవి అచ్చంగా మెదడులోని అణువులనే పోలి ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. అంటే నిద్రలేమి కారణంగా మెదడు కణజాలం విపరీతంగా దెబ్బతింటుందని, ఇది ఎంతగా అంటే తలమీద బరువైన వస్తువుతో గట్టిగా మోదితే ఎంతటి దుష్ప్రభావాన్ని చూపిస్తుందో నిద్రలేమి అచ్చంగా అలాంటి ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా నిద్రలేమితో సతమతమయ్యేవారి రక్తనమూనాల్లో ఎన్‌ఎస్‌ఈ...ఎస్‌`100బి అణువుల పరిమాణం అధికంగా కనిపించడం ఇందుకు సంకేతమని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి కంటినిండా నిద్రపోండి. ఆరోగ్యంగా ఉండండి.

  • Loading...

More Telugu News