: సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక రైళ్లకు రేపు ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్ ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. జౌరంగాబాద్-తిరుపతి, ఔరంగాబాద్ -విశాఖ మధ్య పది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 10, 17, 24, 31 తేదీల్లో సాయంత్రం 6.40 నిమిషాలకు ఔరంగాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. 11, 18, 25 తేదీల్లో తిరుపతి నుంచి ఔరంగాబాదుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 12వ తేదీన రాత్రి 10 గంటలకు సికింద్రాబాదు నుంచి విశాఖపట్నానికి ఏసీ సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీన విశాఖపట్నం నుంచి సికింద్రాబాదు స్టేషనుకు ప్రత్యేక రైలును ప్రయాణీకులకు అందుబాటులో ఉంచారు.