: విభజన బిల్లు రాజ్యాంగ స్పూర్తిని ఎగతాళి చేసేలా ఉంది: వైఎస్సార్సీపీ


రాష్ట్ర విభజన బిల్లు రాజ్యాంగ స్పూర్తిని ఎగతాళి చేసేలా ఉందని వైఎస్సార్ సీపీ ఆరో్పించింది. రాష్ట్రపతి విభజన బిల్లు పంపిన విధానం, దానిపై అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 3న రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. 4వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మోటారు బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. నిరసనలో భాగంగా 6వ తేదీన మానవహారాలు, 7 నుంచి 10వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు వారు ప్రకటించారు.

  • Loading...

More Telugu News