: గిన్నీస్ రికార్డుకెక్కిన 2014 దుబాయ్ బాణాసంచా ప్రదర్శన
కొత్త సంవత్సరం 2014లో అడుగుపెడుతున్న సందర్భంగా దుబాయ్ లో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన ప్రపంచ గిన్నీస్ రికార్డుకెక్కినట్లు గిన్నీస్ సంస్థ తెలిపింది. అతిపెద్ద ప్రదర్శనతో గతంలో ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిందని పేర్కొంది. పదినెలల ముందే ప్రణాళికతో వివిధ రకాలకు చెందిన ఐదు లక్షల క్రేకర్స్ ను ఉపయోగించి నూతన సంవత్సరానికి ఆరు నిమిషాల ముందు వీటిని కాల్చారు. దాంతో, ఇది కొత్త రికార్డును నెలకొల్పినట్లు గిన్నీస్ అధికారులు వెల్లడించారు.