: ఫిబ్రవరి 7న ఓయూ స్నాతకోత్సవం


హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం 79వ స్నాతకోత్సవం ఫిబ్రవరి 7వ తేదీన ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో మూడేళ్లుగా యూనివర్శిటీలో పీజీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 118 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, పీ.హెచ్.డీలు పూర్తి చేసుకున్న 300 మందికి పట్టాలు అందించి సత్కరించనున్నారు. 

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత జరగనున్న స్నాతకోత్సవానికి జాతీయ పరిశోధన అధ్యాపకుడు ప్రొ.గోవింద్ మెహతా ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ హాజరు కావాల్సి ఉండగా, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ తరపున గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసి 11 ఏళ్లు గడవడానికి కారణం... వ్యక్తుల ఎంపికలో ఎదుర్కొంటున్న ఇబ్బందులేనని వీసీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News