: బహిరంగ చర్చకు బాబు సిద్ధమేనా?: మైసూరారెడ్డి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అవినీతికి సంబంధించి వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 18 అంశాలపై కోర్టులో పిటిషన్ వేశారని... ఆ అంశాలపై చర్చకు చంద్రబాబు సిద్ధమేనా? అని వైకాపా నేత మైసూరారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు బహిరంగ చర్చకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. చంద్రబాబు మరొకరి మీద అవినీతి ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. ఈ రోజు మైసూరా హైదరాబాదులోని వైకాపా కార్యాలయంలో మీడియతో మాట్లాడారు.