: జనవరి 23 తర్వాత ఏం జరుగుతుందో చూడాలి: జైరామ్ రమేష్
ఈ నెల 23వ తేదీ వరకు తెలంగాణ బిల్లుపై రాష్ట్ర శాసనసభలో చర్చ జరపడానికి అవకాశం ఉందని కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ తెలిపారు. 23వ తేదీ తర్వాత ఏం జరగబోతోందో చూడాలని అన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.