: రాజేంద్ర నగర్ మహిళా సదస్సులో పాల్గొన్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సుకు పరిసర ప్రాంత ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ ఎక్స్ ప్రెస్ హైవే నుంచి సభా ప్రాంగణానికి టీడీపీ కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.