: బొత్స ఫెయిలయ్యారు.. కేసు వేస్తాం: పాలెం బాధితులు
రవాణాశాఖను నిర్వహించడంలో మంత్రి బొత్స విఫలమయ్యారని పాలెం బస్సు బాధితులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ లో వారు మాట్లాడుతూ బొత్స, ఆర్టీఏ కమిషనర్, జేసీ ప్రభాకర్ రెడ్డిపై మహబూబ్ నగర్ కోర్టులో ప్రైవేటు కేసు వేస్తామని అన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం రేపు అఖిలపక్షం నేతలతో కలసి సీఎంతో చర్చిస్తామని అన్నారు. డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన విరమించేది లేదని వారు తేల్చిచెప్పారు.