: రూ.3,600 కోట్ల వీవీఐపీ చోపర్ ఒప్పందం రద్దు చేసుకున్న భారత్
బ్రిటన్ తయారీ సంస్థ అగస్టా వెస్ట్ లాండ్ తో కుదుర్చుకున్న వీవీఐపీ విమానాల ఒప్పందాన్ని రక్షణ శాఖ రద్దు చేసుకుంది. 2010లో 12 విమానాలు కొనుగోలు చేసేందుకు రూ.3,600 కోట్లతో ఈ ఒప్పందం కుదిరింది. ఇందులో భారత్ కు చెందిన అధికారులు లంచాలు పుచ్చుకున్నారనే తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. దాంతో, విచారణకు ఆదేశించడంతో మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ త్యాగీ, ఆయన బంధువులను సీబీఐ విచారించింది. అటు బ్రిటన్ లోనూ అధికారులు దర్యాప్తు చేయడంతో ఆరోపణలు వాస్తవమేనని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అందువల్లే ఒప్పందం రద్దు చేసుకుందని తెలుస్తోంది.