: సీఎం నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు: డీఎస్


మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని ఎమ్మెల్సీ డీ.శ్రీనివాస్ అన్నారు. ఈ నిర్ణయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. అయితే, ఇలాంటి చర్యల వల్ల రాష్ట్ర విభజన ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. విభజన విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య భావసారూప్యత ఉందని చెప్పారు. శాఖ మార్పుతో షాక్ లో ఉన్న శ్రీధర్ బాబు రాజీనామా చేసే ఆలోచనతో అంతకుముందు డీఎస్ ను కలిశారు.

  • Loading...

More Telugu News