: డబ్బు కోసం.. ఏకంగా ఏటీఎంనే ఎత్తుకుపోయారు


చోరుల్లో చాలా రకాలు ఉంటారు. కానీ, అస్సాంలోని రంగీలా దొంగలు మాత్రం ఘరానా దొంగలు. అందుకే దర్జాగా ఏటీఎంనే ఎత్తుకెళ్లిపోయారు. వారు చోరీ కోసం ఏటీఎం పై కన్నేశారు, పగులగొట్టేందుకు కట్టర్లు, సుత్తెలు తీసుకెళ్లారు. ఎంత యత్నించినా ఏటీఎం మెషీన్ తెరచుకోలేదు. 32 లక్షలున్న ఆ ఏటీఎంను ఎంచక్కా తీసుకుపోయారు. అస్సాంలోని కామరూప్ జిల్లా రంగియా ముర్రా సొసైటీ ప్రాంతంలో డిసెంబరు 29న ఈ ఘటన జరిగింది. చోరీ చేసిన ఎనిమిది మంది దొంగల్లో నలుగురిని పోలీసులు దిహినా గ్రామంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకొన్నారు. రెండు గ్యాస్ సిలిండర్లను, రెండు కంప్యూటర్లను సీజ్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News