: మంత్రివర్గ మార్పులపై సీఎంకు అధికారం ఉంటుంది: పయ్యావుల
మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పుపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. మంత్రుల శాఖల మార్పును రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సభా వ్యవహారాలను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు, ముఖ్యమంత్రి కిరణ్ ఈ పని చేసి ఉంటారని చెప్పారు. మంత్రి వర్గానికి సంబంధంచి ఏ మార్పైనా చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని పయ్యావుల తెలిపారు. ఈ రోజు అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, పయ్యావుల ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని చెప్పారు.