: రాజీనామాకు సిద్ధమైన మంత్రి శ్రీధర్ బాబు?
తన శాఖను ముఖ్యమంత్రి కిరణ్ మార్చడంతో మంత్రి శ్రీధర్ బాబు మనోవేదనకు గురయినట్టు తెలుస్తోంది. ఈ రోజు గవర్నర్ ను కలిసిన అనంతరం, టీమంత్రులు జానా నివాసంలో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో శ్రీధర్ బాబు రాజీనామాకు సిద్ధమయ్యారని విశ్వసనీయ సమాచారం. అయితే, వెంటనే జానా కల్పించుకుని, శ్రీధర్ బాబును సముదాయించి, త్వరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో శ్రీధర్ బాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం.