: కౌగిలించుకోవడానికి నిరాకరించిన బోయ్ ఫ్రెండ్ ని పొడిచేసిన గాళ్ ఫ్రెండ్
జిహ్వకోరుచి పుర్రెకోబుద్ధి అన్నారు పెద్దలు.. జిహ్వ సంగతేమో కానీ, పుర్రెకో బుద్ధి మాత్రం ఉంటుందని నిరూపించిందా ప్రేమ జంట. అమెరికా ఫ్లోరిడాలోని మన్హాటిన్ లో సహజీవనం చేస్తున్న షనోవా రంఫ్, ఆమె బోయ్ ఫ్రెండ్ లు కలిసి మద్యం తాగారు. కాసేపటి తరువాత ఇద్దరూ కలిసే పడుకున్నారు. తనను కౌగిలించుకోవాలని షనోవా అతడిని కోరింది. దానికి అతను నిరాకరించడంతో గొడవ ప్రారంభమైంది.
చిలికిచిలికి గాలివానగా మారడంతో రంఫ్ అతడి షర్టు లాగేసింది. అది చిరిగిపోవడంతో అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వంటింట్లోని కత్తితో అతడిని రంఫ్ పొడిచేసింది. అతను పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడు. దీంతో రంఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తరువాత 250 డాలర్ల బాండ్ సమర్పించడంతో ఆమెను విడుదల చేశారు.