: సెల్ టవర్ పేల్చివేసిన మావోయిస్టులు
ఒడిశాలోని కోరాపుట్ జిల్లా వైపరిగూడ సమీపంలో సెల్ టవర్ ను మావోయిస్టులు పేల్చివేశారు. నూతన సంవత్సరం కావడంతో, భద్రతా బలగాలు బిజీగా ఉండడంతో మావోయిస్టులు పంజా విసిరారు. రాంగిరి, దొండాబడి పరిసరాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో ఏవోబీ వెంబడి భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.