: నేపాల్ లో కారు ప్రమాదం.. ఆరుగురు భారత పర్యాటకుల మృతి


నేపాల్ లో భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న జీపు తనహున్ జిల్లా చున్ పహరా ప్రాంతంలో ఒక నదిలోకి దూసుకుపోవడంతో.. ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ సహా జీపులో మిగిలిన ఐదుగురు గాయపడ్డారు. మొత్తం 10 మంది భారత పర్యాటకులను పోఖరా పట్టణం నుంచి ఖాట్మండుకు తీసుకుని వెళుతుండగా.. గతరాత్రి 11 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులు కోల్ కతాకు చెందిన వారిగా గుర్తించారు.

  • Loading...

More Telugu News