: అద్దంకిలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
ప్రకాశం జిల్లా అద్దంకిలో ఫ్లెక్సీ తొలగింపు విషయమై టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యాకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇద్దరు కార్యకర్తలు గాయపడ్డారు. పలు వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం అద్దంకిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.