: ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేసిన ముషారఫ్
రాజద్రోహం కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కొన్ని నెలల నుంచి తన ఫాం హౌస్ లోనే గృహనిర్బంధంలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఆయనపై విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీన్ని సవాల్ చేసిన ముషారఫ్ నిన్న(మంగళవారం) ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తూ న్యాయస్థానం ఆదేశించడానికి వ్యతిరేకంగా... మరో ధర్మాసనం ఎదుట తాము పిటిషన్ వేశామని ముషారఫ్ న్యాయవాది మహ్మద్ అలీ సైఫ్ తెలిపారు. మరోవైపు ముషారఫ్ నేడు ప్రత్యేక కోర్టు ఎదుట విచారణకు గైర్హాజరయ్యారు. దాంతో, ఐదు వారాల పాటు విచారణ వాయిదా పడింది.