: గుంటూరు జిల్లాలో ఫ్లెక్సీ వివాదం.. రాళ్లతో దాడి చేసుకున్న రెండు వర్గాలు
గుంటూరు జిల్లా క్రోసూరు మండలం నాగవరంలో ఫ్లెక్సీ వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పది మందికి తీవ్ర గాయాలు కాగా, 5 ఆటోలు ధ్వంసమయ్యాయి. ఒక ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.