: షూమాకర్ ఆరోగ్యం మెరుగుపడినా విషమంగానే ఉంది
ఫార్ములా వన్ రేసర్ మైఖేల్ షూమాకర్ ఆరోగ్యపరిస్థితి కాస్త మెరుగుపడినా ఇంకా విషమంగానే ఉందని ఆయన మేనేజర్ సబీన్ కెమ్ తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమంటూ మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవం కాదని అన్నారు. కుమారుడు మిక్, మరికొందరు మిత్రులతో సరదాగా స్కీయింగ్ చేస్తూ మలుపులో రాయికి తల కొట్టుకుని పల్టీలు కొట్టాడు. ఈ క్రమంలో కింద పది మరో రాయిని కొట్టుకున్నాడు.
దీంతో తలకు పెట్టుకున్న హెల్మెట్ కూడా బద్దలైపోయింది. దెబ్బ గట్టిగా తగలడంతో షూమాకర్ కోమాలోకి వెళ్లిపోయాడు. హెల్మెట్ లేకుంటే ఆయన బ్రతికేవాడే కాదని వైద్యులు తెలిపారు. ఫ్రాన్స్ లోని గ్రెనోబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.