: శాఖలు మార్పు ముఖ్యమంత్రి అధికారాల్లో భాగం: మంత్రి ఆనం
గవర్నర్ నరసింహన్ ను మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కలిశారు. అనంతరం ఆనం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. ఇదే సమయంలో శ్రీధర్ బాబు శాఖ మార్పు విషయంపై స్పందిస్తూ.. శాఖల మార్పు అనేది ముఖ్యమంత్రి పరిధిలోని అంశమన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సీఎం అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అనుకుంటున్నట్లు చెప్పారు. కాగా, సీఎంపై మంత్రి జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు. అయితే, శ్రీధర్ బాబు విషయంలో ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.