: ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ ప్రథమ మహిళ
అమెరికా మాజీ ప్రథమ మహిళ బార్బారా బుష్ (88) హోస్టన్ మెథడిస్ట్ ఆసుపత్రిలో చేరారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు యూఎస్ మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ (సీనియర్ బుష్) కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఆమెను భర్త, కుటుంబసభ్యులు కలిశారని, బాగానే స్పందిస్తున్నట్లు వివరించారు.