: పోలీస్ స్టిక్కర్... జీపులో లిక్కర్
పోలీస్ అని స్టిక్కర్ అతికించి ఉన్న జీపులో మద్యం దుకాణాలకు లిక్కర్ సరఫరా చేయడం సామర్లకోటలో కలకలం సృష్టించింది. మద్యాన్ని ప్రత్యేక వాహనాల్లో సరఫరా చేస్తుంటారు. అలాంటిది సామర్లకోటలో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మద్యాన్ని పోలీసు స్టిక్కర్ ఉన్న జీపులో సరఫరా చేయడంపై పలువురు మండిపడ్డారు. దీనిపై ఎస్సై ఎండీఎంఆర్ అలీఖాన్ ను వివరణ కోరగా తాము కోడి పందాల కోసం మద్యం వ్యాపారుల జీపు వాడినట్టు, స్టిక్కర్ తొలగించడం మర్చిపోయినట్టు చెప్పారు. ఈ అంశం వివాదాస్పమవడంతో స్టిక్కర్ ను తొలగించారు.