: నన్ను ఎవరైనా..ఎప్పుడైనా కలవచ్చు.. ప్రజలకు శుభాకాంక్షలు: గవర్నర్


తనకు భారీ భద్రత లేదని, తనను ఎవరైనా, ఎప్పుడైనా కలిసే అవకాశం ఉందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో ఆయన మాట్లాడుతూ తాను క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రానికి వచ్చానని, అయినా ఇక్కడి ప్రజలు తనను బాగా ఆదరించారని అన్నారు. తాను స్వేచ్ఛగా, సాధారణ మనిషిగా ఉండేందుకే ఇష్టపడతానని అన్నారు. సినిమాకి వెళ్లడాన్ని, షాపింగ్ చేయడాన్ని సాధారణ మనిషిగానే తాను ఇష్టపడతానని తెలిపారు.

తాను ఇక్కడికి రావడం వల్లే ఇఫ్తార్ విందులు, హోలీ పండగలు, గణేష్ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం లభించిందని గవర్నర్ చెప్పారు. తనతోపాటు రాష్ట్ర ప్రజలంతా కొత్త ఏడాదిలో ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రప్రజలకు గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు చెప్పారు.

  • Loading...

More Telugu News