: శైలజానాథ్ కు శాసనసభ వ్యవహారాల శాఖ: సీఎం సంచలన నిర్ణయం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసన సభ వ్యవహారాల శాఖను మంత్రి శైలజానాథ్ కు అప్పగించారు. ఇప్పటివరకు మంత్రి శ్రీధర్ బాబు వద్ద ఉన్న ఈ శాఖను శైలజానాథ్ కు బదిలీ చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వద్దనున్న వాణిజ్య పన్నుల శాఖను శ్రీధర్ బాబుకు బదిలీ చేశారు. కాగా కొత్తగా ఏర్పాటు చేసిన తెలుగుభాషాభివృద్ధి శాఖను మరోమంత్రి వట్టి వసంతకుమార్ కు కేటాయించారు. జనవరి 3 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • Loading...

More Telugu News