: తిరుమల సమాచారం


ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ (మంగళవారం) సాయంత్రం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకన వచ్చే భక్తుల దివ్యదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఈరోజు శ్రీవారిని మొత్తం 32,533 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక, సంవత్సరం చివరి రోజు, నూతన సంవత్సరాది కావడంతో తిరుమలకు కాలినడక మార్గంలో, ఘాట్ రోడ్డు ద్వారా భక్తులు భారీగా చేరుకుంటున్నారు. రాత్రి నుంచి భక్తుల రద్దీ క్రమంగా పెరగనుంది.

  • Loading...

More Telugu News