: ముగిసిన ఢిల్లీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అద్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఢిల్లీ ప్రజలకు మంచి నీరు, తర్వాత విద్యుత్ సరఫరా తమ ప్రాధాన్యాలని కేజ్రీవాల్ చెప్పారు. నెలకు 400 యూనిట్లు వాడుకునే వినియోగదారులకు 50 శాతం రాయితీని అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఢిల్లీ నగరంలో 28 లక్షల విద్యుత్ వినియోగదారులకు 50 శాతం తగ్గింపు ఛార్జీలు వర్తించనున్నాయి.