: దేశ ప్రజలకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి నూతన సంవత్సర శుభాకాంక్షలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలు దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలందరికీ శుభం జరగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ ఏడాది అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, మేథో సంపదను దేశాభివృద్ధికి ఉపయోగించాలని ప్రణబ్ ఈ సందేశంలో పేర్కొన్నారు. బలమైన, సుసంపన్నమైన భారత్ నిర్మాణానికి మనమందరం తీర్మానించుకుందామని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పేర్కొన్నారు.