: తిరుమలేశుని దర్శనానికి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వేంకటేశ్వర స్వామిని ఈ ఏడాది కోటి 96 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. గతేడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య 26 లక్షలు తగ్గినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక, ఈ ఏడాది శ్రీవారి హుండీ ఆదాయం 710 కోట్ల రూపాయలు. హుండీలో మార్చి 31న అత్యధికంగా 3.23 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గతేడాది శ్రీవారి ఆదాయం మొత్తం 900 కోట్ల రూపాయలు అని జేఈవో తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం ఈరోజు రాత్రంతా ఘాట్ రోడ్లు తెరిచే ఉంచుతామని జేఈవో ప్రకటించారు. రేపు కొత్త సంవత్సరాది సందర్భంగా శ్రీవారి ఆర్జిత దర్శనాలు రద్దు చేశామని ఆయన తెలిపారు. అలాగే వయోవృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. కాలినడకన వచ్చే భక్తులను ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత క్యూ లైన్లలోకి అనుమతించనున్నట్లు జేఈవో చెప్పారు.