: అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన సీఎం


టీఆర్ఎస్ నేతలు సృష్టించిన గందరగోళం కారణంగా శాసనసభ వాయిదా పడడంతో, అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై వారితో చర్చిస్తున్నారు.

తీర్మానం ఒటింగుకి పెడితే కాంగ్రెస్ సభ్యులంతా అందుబాటులో ఉండేలా చూడాలని కిరణ్ వారికి సూచించే అవకాశం కనిపిస్తోంది. ఈ భేటీలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు ధర్మాన, శ్రీధర్ బాబు, శైలజానాథ్, దానం నాగేందర్, రఘువీరారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News