: గంటపాటు వాయిదాపడిన శాసనసభ... అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన టీఆర్ఎస్!
రెండవరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కాస్సేపటికే వాయిదాపడ్డాయి. ఈ ఉదయం సభ ప్రారంభంకాగానే ముందుగా టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెడుతూ స్పీకర్ కు నోటీసు ఇచ్చారు. బీజేపీ, వామపక్షాలు, తెలంగాణ నగార సమితి నేత నాగం జనార్ధనరెడ్డితో కలిసి మొత్తం 25 మంది సభ్యులు ఈ నోటీసులో సంతకాలు చేశారు. దీనికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మద్దుతు ఇవ్వలేదు.
ఈ సందర్భంగా తెలంగాణ అంశంపై చర్చ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పట్టుబట్టారు. ఇందుకు సభాపతి తిరస్కరించారు. దీంతో స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లి నేతలు తెలంగాణ నినాదాలు చేశారు. సభ సక్రమంగా కొనసాగేందుకు సభ్యులు సహకరించాలని, ముందు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కోరారు. అయినా టీఆర్ఎస్ నేతలు వినకపోవడంతో స్పీకర్ సభను గంటపాటు (ఉదయం 10 గంటల వరకు) వాయిదావేశారు. అంతకుముందు విపక్షాలు పలు సమస్యలపై చర్చించేందుకు స్పీకర్ కు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.