: ఆమె ధైర్యం అసమానం.. పోరాటం అభినందనీయం: చంద్రబాబు
మాఫియాతో పోరాటం అంటే మామూలు విషయం కాదని, నీరజారావు అసమానధైర్యంతో కడప మేయర్ రవీంద్రనాద్ రెడ్డితో పోరాడారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేసిన జూబ్లిహిల్స్ లోని రోడ్ నెంబర్ 2లో కడప మేయర్, వైఎస్సార్ బావమరిది రవీంద్రనాధ్ రెడ్డి ఆక్రమించిన ఇంటి స్థలాన్ని పరిశీలించిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వైఎస్ కారణంగా కడప పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారని అన్నారు. నగరంలో ఇలాంటి మాఫియా చాలా చోట్ల భూ ఆక్రమణలకు పాల్పడిందని అన్నారు. టీడీపీ హయాంలో రౌడీలు, గూండాలకు అవకాశం లేకుండా బోర్డులు పెట్టి ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా కాపాడామని ఆయన తెలిపారు.