: రాష్ట్రపతికి అఫిడవిట్లు అందజేస్తాం: అశోక్ బాబు
సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల ఎమ్మెల్యేల నుంచి అఫిడవిట్లు తీసుకుని రాష్ట్రపతికి అందజేస్తామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన బిల్లు విషయంలో శాసనసభ ముట్టడిపై పండుగ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఐఆర్ పై ముఖ్యమంత్రి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశముందని అశోక్ బాబు చెప్పారు.