: ఇంజనీర్ విడుదలకు సహకరించిన పోలీసులకు కృతజ్ఞతలు: బీఎస్‌సీపీఎల్ ఎండీ
బోడో తీవ్రవాదుల చెర నుంచి ఇంజనీర్ అంకమ్మరావు విడుదలైన విషయం విదితమే. తాను క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులకు ఆయన తెలియజేశారు. ఇంజనీర్ అంకమ్మరావును కిడ్నాప్ చేసిన వారు భారీగా డబ్బు డిమాండ్ చేశారని, అయితే కిడ్నాపర్ల డిమాండ్లకు తలొగ్గలేదని బీఎస్సీపీఎల్ ఎండీ శీనయ్య తెలిపారు. కిడ్నాపర్లు తమ కంపెనీకి చెందిన సప్లయర్లుగా అనుమానం ఉందని ఆయన అన్నారు. ఇంజనీర్ విడుదలకు సహకరించిన పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.