: శ్రీనగర్ లో దట్టంగా కురుస్తున్న మంచు.. ఆరు అంగుళాల హిమపాతం
శ్రీనగర్ వ్యాలీలో రాత్రి నుంచి దట్టంగా మంచు కురుస్తోంది. ఇది చిన్నపాటి వర్షాన్ని తలపిస్తోంది. భారీ హిమపాతంతో రహదారులు మంచు ముద్దలతో నిండిపోయాయి. వాహనాల రాకపోకలకు విఘాతం ఏర్పడింది. పహల్గామ్ లో ఈ ఉదయం 8 గంటల సమయానికి ఆరు అంగుళాల ఎత్తులో మంచు పేరుకుపోయింది. దీంతో మంచును తొలగించడానికి సిబ్బంది రంగంలోకి దిగారు. అలాగే, శ్రీనగర్, కాజీగండ్, కుప్వారాలోనూ రెండు అంగుళాల ఎత్తులో మంచు కురిసింది. లేహ్ పట్టణంలో మైనస్ 12 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది.