: కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించాలి: చిదంబరం
కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు ముందే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ప్రజలు నాయకుడెవరనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారని చెప్పారు. పార్లమెంటరీ, రాష్ట్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలను ముందుగా ప్రకటించడంపై యోచించాల్సి ఉందన్నారు. ఇది తన అభిప్రాయమేనన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ప్రకటించే విషయమై పార్టీలో మథనం జరుగుతున్న సమయంలో చిదంబరం వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.