: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై దాడి కేసులో అనుమానితుడి అరెస్టు


ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి మనిరిజ్విందర్ సింగ్(20)పై దాడి కేసులో ఓ అనుమానితుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్టు భారత విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. అనుమానితుడ్ని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించేందుకు అక్కడి పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెల్ బోర్న్ సమీపంలోని బిర్రాంగ్ మర్ పార్క్ సమీపంలోని ప్రిన్సెస్ బ్రిడ్జి వద్ద కూర్చుని ఇద్దరు స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న మనిరిజ్విందర్ సింగ్ పై, మహిళతో కూడిన ఎనిమిది మంది సభ్యుల బృందం దాడికి పాల్పడింది. ఈ దాడిలో మనిరిజ్విందర్ సింగ్ తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. అతడికి ఆల్ ఫ్రెడ్ ఆసుపత్రిలో వైద్యమందిస్తున్నారు.

  • Loading...

More Telugu News