: రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని కేజ్రీవాల్ కు సూచన
జ్వరం, విరేచనాలతో అస్వస్థతకు గురైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పరిస్థితి మెరుగుపడుతోంది. రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. నిన్న అంత జ్వరంలోనూ ఆయన ఢిల్లీ ప్రజలకు ఉచితంగా నీటి సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు కూడా రెండు గంటల పాటు తన కార్యాలయానికి వెళ్లాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారని, అలా చేయవద్దని, విశ్రాంతి తీసుకోవాలని సూచించానని డాక్టర్ విపిన్ మిట్టల్ తెలిపారు. మరోవైపు అనారోగ్యాన్ని పక్కనపెట్టి.. మద్యం మాఫియా చేతుల్లో హతమైన కానిస్టేబుల్ వినోద్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. వినోద్ కుమార్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని ప్రభుత్వ సాయంగా కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.