: ప్రధాని రాజీనామా చేశారన్న వార్తలు అవాస్తవం: పీఎంవో
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారంటూ వచ్చిన వార్తలు నిరాధారమని, అవాస్తవమని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. మూడోసారి ప్రధాని రేసులో తాను లేనని ప్రకటించేందుకు జనవరి 3న మన్మోహన్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు గతంలోనే సంసిద్ధత వ్యక్తం చేసిన మన్మోహన్ సింగ్ జనవరి 17న జరుగనున్న ఏఐసీసీ సమావేశాల్లోపు ప్రధాని పదవిపై తన అనాశక్తతను వెల్లడించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్న నేపథ్యంలో సీనియర్ నేతలు కూడా ముందుగానే ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తే ఎన్నికల్లో దూసుకుపోవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ఏఐసీసీ సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.