: జస్టిస్ గంగూలీ తొలగింపునకు పచ్చజెండా ఊపనున్న కేబినెట్
లైంగికారోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమబెంగాల్ మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏకే గంగూలీ ఉద్వాసన ఖాయమేనని తెలుస్తోంది. కమిషన్ చైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలుపనున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. జస్టిస్ గంగూలీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన రోజురాత్రి ఢిల్లీలోని ఒక హోటల్లో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని న్యాయవిద్యార్థిని ఆరోపించిన విషయం తెలిసిందే.