: తీవ్రవాదుల చెరనుంచి ప్రకాశం జిల్లా ఇంజనీర్ విడుదల
ఈనెల 22న అసోంలోని చిరాన్ జిల్లాలో బోడో తీవ్రవాదుల చేతికి చిక్కిన ప్రకాశం జిల్లాకు చెందిన ఇంజనీర్ అంకమ్మరావు క్షేమంగా విడుదలయ్యారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురానికి చెందిన అంకమ్మరావు అసోంలో ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తీవ్రవాదుల చెరనుంచి క్షేమంగా విడుదల కావడంతో అతని నివాసంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.