: ప్రాణం మీదికి తెచ్చిన సాహసం
హైదరాబాద్ లోని శిల్పారామంలో జరుగుతున్న యువజనోత్సవాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. మార్షల్ ఆర్ట్స్ విభాగంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి వచ్చిన కుమార్ గొంతుపై కత్తి ఉంచుకుని ఫీట్ ప్రదర్శిస్తుండగా ప్రమాదవశాత్తు కత్తి అతని గొంతులో దిగింది. దీంతో అతనికి గాయమైంది. కానీ ప్రాణానికి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ అంటే కనీసం 20 నిమిషాల సమయం ఇవ్వాలని, కానీ నిర్వాహకులు తక్కువ సమయంలోనే పూర్తిచేయాలని తొందరపెట్టారని అందుకే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శకులు ఎవరైనా పూర్తి శిక్షణ, పర్యవేక్షణతోనే ప్రదర్శన చేయాలని లేకపోతే అపశృతులే ఎదురవుతాయని నిర్వాహకులు సూచిస్తున్నారు.