: మంత్రి కన్నాతో టీడీపీ శ్రేణుల 'ఢీ'.. ఉద్రిక్తత
మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు గుంటూరు టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి అడహగ్ కమిటీ ఏర్పాటు వివాదం గత కొంతకాలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నేటి ఉదయం మంత్రి కన్నా మైదానానికి వచ్చారు. దీంతో టీడీపీ శ్రేణులు, వాకర్స్ మంత్రితో వాగ్వాదానికి దిగారు. మంత్రి అనుచరులు, కమిటీ సభ్యులు ఆందోళన కారులను ప్రతిఘటించి మంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉద్రిక్తత చోటు చేసుకుంది.