: ఫేస్‌బుక్‌పై మోజు తగ్గుతోందట


ఒకప్పుడు యువతలో ఫేస్‌బుక్‌పై విపరీతమైన మోజుండేది. కానీ, క్రమేపీ ఇది తగ్గుతూ వస్తోందట. ఫేస్‌బుక్‌కు బదులుగా ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌, వాట్స్‌ ఆప్‌ వంటి వాటివైపు యువత ఎక్కువగా దృష్టి సారిస్తున్నారట. సామాజిక మీడియా పరిస్థితిపై ప్రొఫెసర్‌ డేనియల్‌ మిల్లర్‌ సారధ్యంలో పరిశోధకుల బృందం నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఒకప్పుడు ఫేస్‌బుక్‌కు అతుక్కుపోయుండే యువత ఇప్పుడు దాన్ని వదిలేసి వీటికి అంటుకుపోతున్నారట. యువతలో ఇప్పుడు ఫేస్‌బుక్‌ అంటే ఆసక్తి తగ్గుతోందని, భారత్‌, చైనా, బ్రెజిల్‌ లాంటి దేశాల్లోని యువత ఫేస్‌బుక్‌ను వదిలేసి ట్విట్టర్‌ లాంటి వాటివైపు మొగ్గు చూపుతున్నట్టు తేలింది.

దీనికితోడు ఫేస్‌బుక్‌ను ఒకప్పుడు యువతే ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు పెద్దవారు కూడా ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. దీంతో యువతలో ఆసక్తి తగ్గుతోందట. తమ అభిప్రాయాలను, భావాలను తమ స్నేహితులకు పంచుకోవాలని భావించే యువత ఇవేవీ తమ బంధువులకు తెలియకూడదనే ఆలోచనతో ఉంటారు. అలాంటిది ఫేస్‌బుక్‌లోకి పెద్దవారు కూడా వచ్చేస్తుండడంతో ఇప్పుడు దాన్ని పక్కనపెడుతున్నారట. అమ్మ, లేదా నాన్నలు ఫేస్‌బుక్‌లోకి వచ్చి రిక్వెస్టులను పంపడం తమకు అంతగా రుచించడం లేదని ఈ అధ్యయనంలో స్పష్టంగా తేలినట్టు పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News