: అంతరిక్షానికి వెళ్లినా 'ఇచ్చి పుచ్చుకోవచ్చు'


భూమికి సుదూరంగా ఉండే అంతరిక్షంలోకి వెళ్లిన వారికి భూమికి సంబంధించిన సమాచారం తెలియడం చాలా తక్కువ. అలాకాకుండా అంతరిక్షంలో కూడా బ్రాడ్‌బ్యాండ్‌ సహాయంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షంలో సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి ఉండే అవకాశాల గురించి తెలుసుకోవడానికి అమెరికా అంతరిక్షసంస్థ నాసా ఒక ప్రాజెక్టును చేపట్టింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల నాసా జరిపిన ముఫ్ఫై రోజుల లూనార్‌ లేజర్‌ కమ్యూనికేషన్‌ డెమాన్‌స్ట్రేషన్‌ (ఎల్‌ఎల్‌సీడీ) ద్వారా అంతరిక్షంలో నుండి కూడా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చని నిర్ధారణ అయ్యింది. లేజర్‌ టెక్నాలజీ సాయంతో చంద్రుడి కక్ష్యలో ఉండి సమాచారాన్ని 622 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో డౌన్‌లోడ్‌, 20 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో అప్‌లోడ్‌ చేయగలిగామని ఎల్‌ఎల్‌సీడీ శాస్త్రవేత్త కార్న్‌వెల్‌ తెలిపారు. తాము ప్రయాణించిన లూనార్‌ అట్మాస్ఫియర్‌ అండ్‌ డస్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎక్స్‌ప్లోరర్‌లో నిక్షిప్తం చేసివున్న డేటాను కేవలం ఐదు నిమిషాల్లోనే డౌన్‌లోడ్‌ చేయగలిగామని కార్న్‌వెల్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News